Eppudu Oppukovaddura Otami Telugu Lyrics | Sirivennela | K J Yesudas | Ilaiyaraja | Pattudala| Suman



చిత్రం : పట్టుదల (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : కె.జే. ఏసుదాస్

source

23 Comments

  1. ఇన్స్పిరేషనల్ సాంగ్. చావాలని ప్రయత్నం చేసేవాడినైనా కసిగా బతికించే సాంగ్. సిరివెన్నెల గుండెని మధించి మధించి రాసిన పాటలు. ట్యూన్ కర్త రాజాగారు అంతే ప్రాణం పెట్టి కంపోజ్ చేశారు. హ్యాట్సాఫ్.

  2. ఓటు మీద ఒక పాట రాసాను సార్. ట్యూన్ నాకు వచ్చు. Orcheshtra ఎలాగో తెలియటం లేదు. హెల్ప్ చేయగలరా? మీలో ఎవరైనా పాడతాను అన్నా ఇస్తాను. రచన నా పేరు వెయ్యండి చాలు.

  3. Super.. words..neethi padyalu,satakapadyalu entha viluvinavo..ilanti spurtinimpe songs anta viluvinavi..Thanks for your gift sirivennela garu…

  4. I cant believe he is not there. I know this when i was 27 just joined as developer in citi in SG against all odds i want go back. Then one of my cousin show this video on his so called 2g mobile and today i'm heading datascience team here. Some say the power lies in muting yourself when u r in collision with others. This song from guru garu advice us alway u should be in front foot to face the problem n succed or over come it. Ppl say he given good service to telugu cinema but i say he given to mankind. Long live sastry garu

  5. దేహముంది ప్రాణముంది రక్తంముంది ఇంతకన్న సైన్యమేముందిరా….

  6. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
    ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
    విశ్రమించవద్దు ఏ క్షణం
    విస్మరించవద్దు నిర్ణయం
    అప్పుడే నీ జయం నిశ్చయంరా ॥

    చరణం : 1
    నొప్పి లేని నిమిషమేది జననమైన
    మరణమైన జీవితాన అడుగు అడుగునా
    నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
    బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
    దేహముంది ప్రాణముంది నెత్తురుంది
    సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
    ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
    దీక్షకన్న సారధెవరురా
    నిరంతరం ప్రయత్నమున్నదా
    నిరాశకే నిరాశ పుట్టదా
    నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే ॥

    చరణం : 2
    నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
    రెక్కముందు తక్కువేనురా
    సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల
    మొప్పముందు చిన్నదేనురా
    పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
    హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా
    ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
    కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
    త్రి విక్రమా పరాక్రమించరా
    విశాల విశ్వమాక్రమించరా
    జలధిసైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా ॥

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy