It is my first song written on Lord Venkateswara Swamy!! I am so blessed by my GOD.
Music by K Sridhar, who is my Guruji and a famous Karnatic Musician. My Sincere thanks to #Sridhar Master for encouraging me and making this song beautiful!
Singer Satya Yamini sung beautifully and melodiously.
My inspiration #Annamayya sankeerthanas. He wrote 32k Sankeerthanas on Lord Venkateswara Swamy. He is always in my heart and am proud of a big of him.
Motivated to write this song by pravachanams of Sriman Pujya Guruji #Chaganti Koteswara Rao. My sincere thanks to Guruji
My humble thanks to all Musicians, my supporters and well wishers.
#Namo Venkateshaya #Govinda Govinda #Tirumaleshudu
రాగం: మధ్యమావతి
తాళం: త్రిశ్ర
పల్లవి;
వేంకటేశుడు మా తిరుమలేశుడు –
గోవిందుడు కాదా మన ఆత్మరాముడు
శ్రీ నివాసుడు మా హృదయవాసుడు –
సిరి మంతుడు కాదా మా స్థిరనివాసుడు
ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు….
ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు….
ఎన్నిమెట్లు ఎక్కినా అలసట్టుండదు…
నిను ఎన్నిసార్లు చూసినా…..ఎదురు చూపు ఆగదు…. !!వేంకటేశుడు!!
చరణం1:
నరులకు సురులకు నీవే దైవమంటివా….
కొలిచిన భక్తుల మనసున కొలువు వుంటివా….
Chorus:
నారాయణ నమో నారాయణ – నారాయణ నమో నారాయణ
గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా…..
గడచిన జన్మల పాపం తొలిచి పోదువా….
Chorus:
నారాయణ నమో నారాయణ – నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ ఏడుకొండలను చూడ….
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా…..
!!వేంకటేశుడు!!
చరణం2:
లాలన పాలన నీకే ఇష్టమంటివి….
యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి…
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ధర్మం నిలుపుటకు నీవే రాముడైతివి….
కౌసల్యమ్మకి బంగరు కొండవైతివి….
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత పుణ్యమో నీ పేరుపెట్టి మే పిలువా….
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా….
!!వేంకటేశుడు!!
చరణం3:
కలియుగమంతా నిలబడి అలసిపోయినా….
అలమేలు తల్లి నీ పాద సేవ సేయునా….
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
బ్రహ్మాండం నీ చేతిలో అణువంతైనా….
కొడుకు తిన్నాడో లేదోని వకుళమ్మ అడిగెనా….
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ…
జన్మధన్యమో నీ నామ స్మరణలో మునుగా…
!!వేంకటేశుడు!!
source
Super
Nice song
Saahityam pedite bagunnu
పాట అమృతం తాగినట్లు వుంది
Ohh…Abba Abba chaaalaaaa suuuuper amma meee gaanammm…
ఓం నమో వెంకటేశాయ ఈ పాటను వ్రాసిన వారికి. ఎంతో మధురం గా పాడిన బంగారు తల్లి …… ఇంకా ఎన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాము
మనసుకు హత్తుకునే శ్రీనివాసుని సాంగ్స్. తనివి తీరడం లేదండి ఎన్నిసార్లు విన్నా కూడా..మ్యూజిక్ కానీ లిరిక్స్ సూపర్…సూపర్….
వెంకటేశుడు మా తిరుమల శివుడు గోవిందుడు నా దామన్న ఆత్మ రాముడు శ్రీనివాసుడు మా హృదయ వాసుడు జైశ్రీరామ్ అమ్మ చాలా బాగా పాడారు మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీమన్నారాయణ
Wonderful singing ramyaji hatsof to you
మల్లేశ్ గారు ఎలా వున్నారు.. ఫామిలీ అంతా బావున్నారా…మా అమ్మ గారు బానే వున్నారు సర్…మీ నెక్స్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాము సర్….God bless you're family…
విని తరించాను….గాయకులకు, రచయితకు,పాట కరకులకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు….
గురువు గారికి నమస్కారం,అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట నాకు చాలా నచ్చింది.ధన్యవాదములు.
Govinda govinda
Chala bavundhi baga oadaru
Govidha
Veryveryhappy 3:46
మల్లేశ్ గారు మీ సమాధానాన్ని మా అమ్మ గారికి చదివి వినిపిస్తుంటే ,… వింటూ అమ్మ ఆనందానుభూతితో
మీకు నూరేండ్ల ఆయుష్షు ని ఆ స్వామి ప్రసాదించాలని మిమ్మల్ని దీవిస్తూ… ఇంకా చాలా పాటలు చెయ్యమని , చెప్పమంటున్నారు నన్ను …. మీరు ఆత్మీయంగా రాసిన మాటలకు చాలా ఆనందపడుతూ, మళ్ళీ మళ్లీ చదివి వినిపించమంటూ , చాలా ప్రశాంతతను పొందుచున్నారు…మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తున్నారు సార్… మీకు చాలా చాలా కృతజ్ఞతలు మల్లేశ్ గారు… ఆ వేంకటేశ్వర స్వామి మీకు మీ కుటుంబాని కి ఆయుఃఆరోగ్య అష్టఐశ్వార్యాలను ప్రసాదంచాలని కోరుకుంటూ, మీ పాటల కోసం వేయి కళ్ల తో ఎదురు చూస్తుంటాము సర్ మా అమ్మ గారి తో సహా…. God bless us all….
.
మల్లేశ్ గారు మీరు రాసిన రెండు కీర్తనలు చాలా చాలా అద్భుతంగా వున్నాయి… వింటుంటే కలిగే ఆనందానుభూతిని మాటల్లో చెప్పలేము…. పాటవింటూ , స్వామి ఊరేగింపు చూస్తూ…. మా మనస్సులని మాఢవీధులలో విహరింప జేసిన మీకు,ఆ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా వుండాలని, ఇంకా మరిన్ని మంచి మంచి కీర్తనలు రాయగలిగే విధ్వత్ ని మీకు కలిగించాలని వేడుకుంటున్నాను… సులభమైన పదాలతో, మధ్యమావతి రాగం లో ఎవరైనా పాటని పాడుకుని పరవసించేలా, పాటని అందించిన మీకు, మీ టీమ్ కి, తన్మయం తో పాడిన, సత్య యామిని కి శతకోటి వందనాలు… ఇంత గొప్ప పాట 1మిలియన్ ఏంటి వంద మిలియన్ల కి చేరుకుంటుంది … మీ నెక్స్ట్ సాంగ్ కోసం వేయి కళ్ల తో ఎదురు చూస్తుంటాము సార్ …God bless you….