#మణిద్వీపవర్ణన #ManidweepaVarnana
మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి
మన మనస్సులలో కొలువైయుంది
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహనిధులు
పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యము
పద్మరాగములు సువర్ణమణులు
పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు
అరువది నాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు
అష్టసిద్ధులు నవనవ నిధులు
అష్టదిక్కుల దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు
కోటి సూర్యుల ప్రచండకాంతులు
కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యము
కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణి ద్వీపానికి మహానిధులు
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణి ద్వీపానికి మహానిధులు
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణి ద్వీపానికి మహానిధులు
సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు
మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యం
మిలమిలలాడే ముత్యపురాసులు
తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు
కుబేర ఇంద్ర వరుణదేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు
భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు
పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిదులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే కైవల్యము
మంత్రిణి దండిని శక్తిసేనలు
కాళికరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
సువర్ణరజిత సుందరగిరులు
అనంతదేవీ పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు
సప్తసముద్రము లనంత నిధులు
యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు
మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యము
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు
పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యము
చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు
ధుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు
పదునాలుగు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వతస్థానం
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో
శ్రీ భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే కైవల్యము
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో
పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు
శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంట
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
శ్రీ భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే కైవల్యము
Song: Mani Deepa Varnana
Singer: Rashmi Adish, Mysore
Music: Jayasindoor Rajesh
Lyrics: Traditional
Label: Jayasindoor Entertainments
Website:
Durga Devi –
VarnanaWith Telugu Lyrics,Mandweepa Varnana,Jayasindoor Rashmi Adish,Goddess Lalitha Devi Songs,Rashmi Adish,Jayasindoor Rajesh,manidweepa varnana,manidweepa varnana in telugu,manidweepa varnana in telugu 9 times,manidweepa varnana stotram,manidweepa varnana pooja vidhanam,manidweepa varnana lyrics in telugu,manidweepa varnana telugu,manidweepa varnana telugu lyrics,manidweepa varnana lyrics
Rashmi Adish,Jayasindoor Rajesh,Goddess Lalitha Devi Songs,manidweepa varnana,manidweepa varnana in telugu 9 times,Rashmi Adish,manidweepa varnana telugu lyrics,mandweepa Varnana With Telugu Lyrics,manidweepa varnana in telugu lyrics,manidweepa varnana in telugu fast,devotional songs telugu,devotional,jayasindoor divine music,telugu devotional songs,jayasindoor,Mandweepa,Sree Manidweepa,Telugu Lyrics,divine
source
Madam maku songs emaina nerpistara
Jaya Sindhuri
Sorry to say that You have copied our tune.
Chaala bagundi.. om sri matre namah..
Lakshmi.kataksham.prapthirastu
*pransbilrni
Jilledu poolatho cheyocha pooja tel me please
Ik.
Plz this pooja vidhanam book ento chepthara
Pathala Bhairavi movie NTR old movie
Chala bagundi
Wow..beautiful. and with Telugu lyrics it's now very easy to learn and read. Chala bagundi.