Learn Here Sai Chalisa with Telugu Lyrics | Shirdi Vasa Sai Prabho | Sangeetha Sadhananjali
#thursdayspecial #geethanjali #shirdisaibaba #saichalisa
►Follow us:
►Follow us:
** Song Credits **
శ్రీ సాయి చాలీసా
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శనమియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా
|| షిరిడీవాస ||
కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం
|| షిరిడీవాస ||
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలములను
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం.
|| షిరిడీవాస ||
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం
|| షిరిడీవాస ||
నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
|| షిరిడీవాస ||
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశనము కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషమును తొలగించి
|| షిరిడీవాస ||
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విట్టల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
|| షిరిడీవాస ||
కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొనె నిను మేఘా తెలుసుకొని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము
|| షిరిడీవాస ||
డాక్టరుకు నీవు రామునిగా బల్వంత్ కు శ్రీదత్తునిగా
నిమోనుకర్ కు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శన మిచ్చిన శ్రీసాయి
|| షిరిడీవాస ||
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
|| షిరిడీవాస ||
అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యం సాయిని కొలిచెదము
|| షిరిడీవాస ||
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చెయ్యాలండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తుల కాపాడేనోయి
|| షిరిడీవాస ||
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి
|| షిరిడీవాస ||
వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
|| షిరిడీవాస ||
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజపరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై జై జై
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW:
👉 Like Us on Facebook:
👉 Follow us on Instagram:
👉 Follow us on Twitter:
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
source
Amma Rama kodanda rama song nerpinchandamma
Thank you mam. Please teach us hanuman dandakam
Siddamangala stotram neripichandi
thank you madam
Sairam
Very melodious voice
Sooper mam almost ma amma kuda ilane nerpincharu baba temple lo ilane padutham but ur voice is amazing oka madhuryam untundhi me patalo tqqqq so much
Mam harathulu neerpinchande
మేడం నమస్కారం.
మీరు నేర్పించే విధానం అద్భుతం
సంగీత పరిజ్ఞానం లేని నాకు మీ video లు chuthunte నాకు సంగీతం నేర్చుకోవాలి అనిపించింది. ఈ మధ్యే గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను.
మేడం దయచేసి మోహనరగం సరళీశ్వరాలు, jantaswaralu, అకార సాధన నేర్పించగలరు