Devudu Varamandisthe Telugu Lyrics Video| 6 Teens | Suddala Ashok Teja | Kumar Sanu | Ghantadi Kris



చిత్రం : 6 టీన్స్ (2001)
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
సంగీతం : ఘంటాడి కృష్ణ
పాడినవారు : కుమార్ సాను

Subscribe and Support

Nenu Naa Paata

source

20 Comments

  1. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    ఆ… నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
    ఓ… దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
    ఓ… కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
    తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
    నా ఊపిరి చిరునామా నువ్వే…

    ఆ… దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

    ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
    ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో
    ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
    ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో

    చరణం: 1
    మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
    మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
    నా… మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
    మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
    నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
    నే మలిచాను హరివిల్లునే కుంచెగా
    ఈ చిరుగాలితో చెప్పనా
    నీ మదినిండనేనుండగా…

    దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

    చరణం: 2
    ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
    కొంగుముడిని వేయాలంటూనిన్ను వేడుకుంటున్నా
    ఆ… ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
    కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
    నా కలలన్నీ నీ కనులు చూడాలని
    బతిమాలాను నీ కంటిలో పాపని
    మన్నించేసి నా మనసునీ
    ప్రసాదించు నీ ప్రేమనీ

    దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

    ఓ… కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
    తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
    నా ఊపిరి చిరునామా నువ్వే…
    ఓ… దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
    దేవుడు వరమందిస్తే… నే నిన్నే కోరుకుంటాలే…

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy